Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. ‘భైర’ పాత్ర అదిరిందిగా..

తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. ‘భైర’ పాత్ర అదిరిందిగా..

Devara Movie Saif Ali Khan Bhaira Character Glimpse Released

Devara Glimpse : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా నేడు మరో గ్లింప్స్ రిలీజయింది.

దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో భైర అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడని గతంలో ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు.