ఆమె నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉంది- వాణి సంచలన వ్యాఖ్యలు

దువ్వాడ దంపతుల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని వాణి తెలిపారు.

ఆమె నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉంది- వాణి సంచలన వ్యాఖ్యలు

Duvvada Vani : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి నుంచి శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందన్నారు. మాధురి ట్రాప్ లో శ్రీనివాస్ పడ్డారని ఆరోపించారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తన కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. పోలీసులు తక్షణమే స్పందించాలని, దువ్వాడ ఇంట్లో ఉంటున్న అనధికార వ్యక్తులను బయటకు పంపించాలని కోరారు. రేపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానన్నారు వాణి. దువ్వాడ దంపతుల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు.