Aloe Vera Cultivation : లాభదాయకమైన వ్యాపారం.. అలోవెర సాగు

Aloe Vera Cultivation : కలబందగా పేరు గాంచిన ఈ మొక్క  అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి.

Aloe Vera Cultivation : లాభదాయకమైన వ్యాపారం.. అలోవెర సాగు

Aloe Vera Cultivation

Aloe Vera Cultivation : ఔషదగుణాలు కలిగిన పంట కలబంద. దీనినే అలోవెర అంటారు. దీని ఆకుల నుండి వచ్చే జెల్ ను సౌందర్య సాధనాలతో పాటు అనేక ఔషదాల్లో వాడుతారు. అలాగే అనేక జ్యూస్ లలో వాడుతుంటారు. అందుకే మార్కెట్ లో అలోవెరాకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఎకరన్నరలో అలోవేర సాగు చేపట్టారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆవివరాలేంటో  ఇప్పుడు చూద్దాం..

Read Also :Aloe Vera : శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటంతోపాటు, బరువును తగ్గించే కలబంద! 

కలబందగా పేరు గాంచిన ఈ మొక్క  అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఆకులు మందంగా రసంతో అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాతాల్లో పెరిగే మొక్క. అలోవెర అనే రోగాల నివారణకు వాడుతుంటారు. అంతే కాదు దీని జెల్‌ను చర్మ సౌందర్య క్రీముల తయారిలోనూ ఉపయోగిస్తుంటారు.

యంత్రాలను ఉపయోగించి ఆకులనుండి జెల్, జ్యూస్ ను తయారు చేయగలిగితే అలోవీర నుండి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. లేదంటే దగ్గరలో ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నవారు, బైబ్యాక్ తీసుకునే సదుపాయం ఉన్నవారు సాగుచేసుకోవచ్చు.

లేదంటే మార్కెటింగ్ సమస్య తలెత్తుతుంది. అలోవెరను వర్షాధారంగా, నీటి పారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసని కాలంలో, వర్షాభావ పరిస్థితులలో నీటి సదుపాయం కల్పించడం ఆవసరం. అలోవెర సాగులో క్రమం తప్పకుండా కలుపు మొక్కలు తీయాలి. మొక్కల చుట్టూ తవ్వడం, మొదళ్లలో మట్టి పోయడం చేస్తుండాలి.

అలా ఒకసారి నాటిన పంట నుండి 4 నుండి 5 ఏళ్ళపాటు దిగుబడిని తీసుకోవచ్చు. గతంలో సాగుచేసిన అనుభవంతో ఈ ఏడాది కూడా ఎకరన్నరలో నాటారు అనంతపురం జిల్లా,  కూడేరు మండలం, కూడేరు గ్రామానికి చెందిన రైతు రమేష్ . మరి ఆ పంట సాగు వివరాలు..  రైతు అనుభవాలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం.

Read Also : Tomato Cultivation : వివిధ దశల్లో ఖరీఫ్ టమాట సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం