తిరుమలలో నీటి సంక్షోభం..! టీటీడీ అలర్ట్.. స్థానికులకు, భక్తులకు కీలక విన్నపం
స్థానికులు, భక్తుల అవసరాలు తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యామ్ లలో ఉన్న నీళ్లు..

Tirumala Water Crisis : తిరుమలలో నీటిని పొదుపుగా వినియోగించాలని భక్తులు, స్థానికులను టీటీడీ కోరింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీళ్లు 130 రోజులకు మాత్రమే సరిపోతాయని తెలిపింది. ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. స్థానికులు, భక్తుల అవసరాలు తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యామ్ లలో ఉన్న నీళ్లు 120 నుంచి 130 రోజులకు మాత్రమే సరిపోతుందని టీటీడీ ప్రకటించింది.
నీటి నిల్వలు తగ్గిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. కేవలం ఇక 130 రోజులకు మాత్రమే తిరుమల జలాశయాల్లో ఉన్న నీరు తిరుమల అవసరాలకు సరిపోతుందని ప్రకటించింది టీటీడీ. తిరుమలలోని గోగర్భం జలాశయంలో సగానికి పైగానే నీటి నిల్వలు ఉన్నాయి. ఇటువంటి జలశయాలు మొత్తం 5 ఉన్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార డ్యామ్ లు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి నిండినట్లు అయితే దాదాపు రెండేళ్ల వరకు తిరుమల అవసరాలకు నీరు సరిపోతుంది. రెండేళ్ల వరకు తిరుమలలో నీటి కొరత అన్నదే ఉండదు. సగానికి పైగానే నీరు ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయా లేదా అన్న అనుమానాలతో టీటీడీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు 130 రోజులకే సరిపోతాయని టీటీడీ తెలిపింది.
తిరుమలలో నివాసం ఉండే స్థానికులు, తిరుమలకు వచ్చే భక్తులు.. నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ సూచించింది. ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా తిరుమలలోని హోటళ్లకు 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. స్థానికులకు దాదాపు ఐదారు రోజులకు ఒకసారి నీటిని వదులుతున్నారు. తక్కువ వర్షపాతం నమోదైందని టీటీడీ తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడతాయా లేదా అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో తిరుమల డ్యామ్ లలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
తిరుమల జలాశయాల నుంచి రోజుకు 18 లక్షల గ్యాలన్ల నీటిని తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన నీటిని తిరుపతి కల్యాణి డ్యామ్ నుంచి తీసుకుంటున్నారు. మొత్తంగా 44 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమల అవసరాలకు నిత్యం టీటీడీ వాడుతుంటుంది. అయితే, తిరుమలలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో టీటీడీ అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని అంచనా వేసిన టీటీడీ.. ఇప్పటి నుంచే పొదుపు చర్యలు చేపట్టింది.
Also Read : వీఆర్ఎస్‌పై సీనియర్ ఐఏఎస్ యూటర్న్..! మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం..!
* తిరుమలలో నీటి సంక్షోభం
* తిరుమలలో 130 రోజులకు మాత్రమే సరిపడా నీళ్లు
* తిరుమలలో నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరిన టీటీడీ
* ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదు
* తిరుమలలోని ఐదు ప్రధాన డ్యాముల్లోని నీళ్లు 120-130 రోజులకు మాత్రమే సరిపోతాయన్న టీటీడీ
* తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43లక్షల గ్యాలన్ల నీటి వినియోగం
* 18 లక్షల గ్యాలన్ల నీరు తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్ ల నుంచి వస్తాయి
* తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి మిగిలిన నీళ్లు సేకరణ
* అందుబాటులో కేవలం 5వేల 800 లక్షల గ్యాలన్ల నీరు
* అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృథాను అరికట్టాలని నిర్ణయం
* నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు టీటీడీ చర్యలు