Nani : యాంకర్ అడిగిన ప్రశ్నకి.. ఆ సినిమా క్యారెక్టర్‌తో యాంకర్‌ని ఆడేసుకున్న నాని..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని యాంకర్ ని సరదాగా ఆటపట్టించాడు.

Nani : యాంకర్ అడిగిన ప్రశ్నకి.. ఆ సినిమా క్యారెక్టర్‌తో యాంకర్‌ని ఆడేసుకున్న నాని..

Nani Fun with Anchor in Saripodhaa Sanivaaram Promotions

Nani : న్యాచురల్ స్టార్ నాని రేపు ఆగస్టు 29న సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో నాని ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని యాంకర్ ని సరదాగా ఆటపట్టించాడు.

ఇంటర్వ్యూలో యాంకర్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాకు సీక్వెల్ ఉందా అని అడగ్గా.. నాని వెంటనే ఆ సినిమా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి క్వశ్చన్ మర్చిపోయినట్టు నటించి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నని యాంకర్ తో అడిగించాడు. చాలా సేపటికి గాని యాంకర్ ని నాని యాక్ట్ చేస్తున్నాడని అర్ధం కాలేదు.

Also Read : Rao Ramesh – Pushpa : పుష్ప 1లో ఇంతే మీ పాత్ర అని చెప్పి డేట్స్ పార్ట్ 2కి తీసుకున్నారు.. పుష్ప 3లో కూడా ఉండొచ్చేమో..

భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని మతిమరుపు ఉన్న క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాంకర్ ఆ సినిమా గురించి అడగ్గానే వెంటనే ఆ క్యారెక్టర్ లోకి వెళ్లి నాని నటిస్తూ మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నాని భలే రియాక్ట్ అయ్యాడు అంటూ నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.