కడిగిన ముత్యంలా బయటకు వస్తాను- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ కాన్వాయ్ తో తన నివాసానికి చేరుకున్నారు కవిత.

కడిగిన ముత్యంలా బయటకు వస్తాను- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ బద్ధమైన పోరాటం గెలిచిందన్నారు కవిత. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి.

Also Read : ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో వాళ్ల కట్టడాలుంటే వివరాలివ్వండి.. నేను దగ్గరుండి కూలగొట్టిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ కాన్వాయ్ తో తన నివాసానికి చేరుకున్నారు కవిత. కవితను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా బస్తీ వాసులు తరలివచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు.. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదున్నర నెలలు ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు కవిత.