Prabuthwa Junior Kalashala : టీనేజీ లవ్ స్టోరీ మూవీ ఓటీటీలోకి.. ఇంటర్ ప్రేమ కథలు..

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తొలిప్రేమ, టీనేజ్ లవ్ స్టోరీ, అప్పటి సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి అంశాలతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది.

Prabuthwa Junior Kalashala : టీనేజీ లవ్ స్టోరీ మూవీ ఓటీటీలోకి.. ఇంటర్ ప్రేమ కథలు..

Prabuthwa Junior Kalashala Punganuru Movie Streaming in OTT Details Here

Prabuthwa Junior Kalashala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఇంటర్ చదివే రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించగా జూన్ 21న థియేటర్స్ లో రిలీజయింది.

Also Read : Allu Arjun – Balakrishna : బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు ఐకాన్ స్టార్.. టాలీవుడ్ స్టార్స్ అంతా కదిలొచ్చేలాగే ఉన్నారుగా..

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తొలిప్రేమ, టీనేజ్ లవ్ స్టోరీ, అప్పటి సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి అంశాలతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. థియేటర్స్ నుంచి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇటీవల వరుసగా తెలుగు సినిమాలను తీసుకొస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మరో వారం రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా రానుంది ఈ సినిమా. యూత్ లవ్ స్టోరీలు నచ్చేవాళ్ళు థియేటర్స్ లో మిస్ అయితే ఈ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి.

Prabuthwa Junior Kalashala Punganuru  Movie Streaming in OTT Details Here