భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది: వివరాలు తెలిపిన చంద్రబాబు

ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోందని, సోమవారంలోగా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే..

భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది: వివరాలు తెలిపిన చంద్రబాబు

భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నడూ పడనంత వర్షం పడిందని తెలిపారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ఏపీలోని 14 నియోజకవర్గాల్లో 20 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు.

వత్సవాయి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో 30 శాతం వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు తెలిపారు. జాతీయ రహాదారులు స్తంభించిపోయాయని, రోడ్ల మీదకు నీరొచ్చేసిందని చెప్పారు. నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించానని, ప్రభుత్వం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉందని తెలిపారు. అయినప్పటికీ తొమ్మిది మరణాలు సంభవించాయని చెప్పారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని, 1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల్లో ద్వారా వచ్చే ప్రమాదముందని తెలిపారు.

ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోందని, సోమవారంలోగా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయని చెప్పారు. దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వస్తోందని, 1.50 లక్షల హెక్టార్లల్లో వరి పంట, ఉద్యాన పంటలూ నష్టపోయాయని చెప్పారు.

దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు
గుడ్లవల్లేరు ఘటన దారుణమని, ఓ ఎస్ఐ విద్యార్థినులతో కొంచెం పద్ధతిగా వ్యవహరించకుంటే బాగుండేది. అన్ని హాస్టళ్లల్లో ఇలా జరుగుతోందని దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. 300 వీడియోలు ఉన్నాయంటూ ఏదేదో చెబుతున్నారని, ఆడబిడ్డల శీలాన్ని కూడా అహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

గుడ్లవల్లేరులో నిజాలను నిగ్గు తేల్చేందుకు ఓ టెక్నికల్ నిపుణుల టీంను వేస్తున్నామని, అనుమానితుల గాడ్జెట్లను పరిశీలిస్తామని తెలిపారు. వైసీపీ వాళ్లు దుష్ప్రచారం చేయడమే కాదు.. కుట్రలు పన్నుతారని చెప్పారు. బాబాయ్ హత్య కేసులో తన విషయంలోనే కుట్ర చేశారని, ఏపీలో జరిగిన వివిధ ఘటనల్లో వైసీపీ ఉందనే అనుమానాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు.

Heavy Rains

Also Read: ఆ పేదలకే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు: ఈటల రాజేందర్