Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఆరు రోజుల్లో గోల్డ్ రేటు ఎంత తగ్గిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం, వెండి ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఆరు రోజుల్లో గోల్డ్ రేటు ఎంత తగ్గిందో తెలుసా?

Gold And Silver Price Today

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. గత ఆరు రోజులుగా 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 490 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 900 తగ్గింది. గడిచిన వారం రోజుల్లో కిలో వెండిపై రూ. 3500 తగ్గింది. దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,760.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,840 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,910.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,690 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.72,760.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,690 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై రూ. 900 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.90,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 85,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 83,000 వద్ద కొనసాగుతుంది.

Gold
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.