జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్.. ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన నేతలు.. మోదీ పర్యటన ఎప్పుడంటే?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్.. ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన నేతలు.. మోదీ పర్యటన ఎప్పుడంటే?

Jammu and Kashmir Assembly Election 2024

Jammu and Kashmir Elections 2024 : జమ్మూకశ్మీర్ లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న మొదటి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1వ తేదీన మూడో విడతలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూకాశ్మీర్ లో పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలు తమ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ కి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Also Read : జమ్మూకశ్మీర్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలంటే?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. సెప్టెంబర్ 18న జరగనున్న తొలిదశ ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో, ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాబోయే మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోపాటు 40 మంది స్టార్ క్యాంపెయినర్ లు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నారు. జమ్మూ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ 32 నియోజకవర్గాల్లో, ఎన్సీ 51 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. రెండు పార్టీలు ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి నిర్ణయించాయి. సీపీఐ(ఎం), పాంథర్స్ పార్టీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు.

Also Read : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. 44మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ముస్లీం అభ్యర్థులు ఎంతమంది అంటే?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కాశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. సెప్టెంబర్ 6న జమ్మూకశ్మీర్ లో హోమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగనుంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పర్యటనలో అమిత్ షా విడుదల చేయనున్నారు. వచ్చేవారం నుంచి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వీరితోపాటు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తూ జమ్మూలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.