Reliance Jio Plans : రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం.. సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లు, ఓటీటీ బెనిఫిట్స్ ఇవే!

Reliance Jio Plans : జియో వార్షికోత్సవ స్పెషల్ ప్లాన్లలో రూ.899 నుంచి రూ.999 రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్‌ 90 రోజులు, రూ.999 ప్లాన్‌కు 98 రోజుల వ్యాలిడిటీతో పాటు 2జీబీ రోజువారీ డేటాను అందిస్తాయి.

Reliance Jio Plans : రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం.. సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లు, ఓటీటీ బెనిఫిట్స్ ఇవే!

Reliance Jio announces special plans for subscribers ( Image Source : Google )

Reliance Jio 8th Anniversary Plans : జియో యూజర్లకు పండుగే.. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. ఈ వార్షికోత్సవ వేడుకలో భాగంగా, సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10 మధ్య రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు నిర్దిష్ట ప్లాన్‌లపై రూ.700 విలువైన ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?

టెలికాం దిగ్గజం త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్‌లను రూ. 899, రూ. 999 ధరకు అందిస్తుంది. అలాగే జియో వార్షిక ప్లాన్ ధర రూ. 3599 కూడా అందిస్తోంది. ఈ ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు, జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, (AJIO)తో వస్తాయి. షాపింగ్ వోచర్‌లు, జియో యూజర్లు పొందవచ్చు.

జియో స్పెషల్ ప్లాన్లు, బెనిఫిట్స్ ఇవే :
జియో వార్షికోత్సవ స్పెషల్ ప్లాన్లలో రూ.899 నుంచి రూ.999 రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.899 ప్లాన్‌ 90 రోజులు, రూ.999 ప్లాన్‌కు 98 రోజుల వ్యాలిడిటీతో పాటు 2జీబీ రోజువారీ డేటాను అందిస్తాయి. అదే సమయంలో, రూ. 3599 వార్షిక ప్లాన్ 2.5జీబీ రోజువారీ డేటా కోటా కొద్దిగా ఎక్కువగా అందిస్తుంది. 365 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ జియో యూజర్లకు అదనపు బెనిఫిట్స్ అందిస్తాయి.

10 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ అందిస్తుంది. 10జీబీ డేటా వోచర్, ఈ రెండింటి విలువ రూ. 175 కాగా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. అదనంగా, జియో యూజర్లు జొమాటో గోల్డ్‌కి 3 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. వారికి ఇష్టమైన రెస్టారెంట్‌లలో భోజనం ఆర్డర్ చేసి డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను పొందవచ్చు. అంతేకాకుండా, జియో కస్టమర్లు (AJIO)లో కొనుగోళ్లకు రూ. 500 వోచర్‌ను పొందుతారు. రూ. 2999 కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై రీడీమ్ చేసుకోవచ్చు.

ఈ జియో ఆఫర్ ద్వారా డిజిటల్ సర్వీసులు, హై-స్పీడ్ డేటాను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది. 8ఏళ్ల క్రితమే జియో భారత మార్కెట్లో డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. ఇప్పటివరకూ జియో 490 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు సేవలు అందిస్తోంది. భారత డిజిటల్ విప్లవాన్ని నడపడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

జియో వార్షికోత్సవ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబరు 10 వరకు అన్‌లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు వారి రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అదనపు డేటా, ఓటీటీ కంటెంట్‌కు యాక్సెస్ లేదా ప్రత్యేకమైన షాపింగ్, డైనింగ్ డీల్స్ ద్వారా జియో యూజర్లు డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో ధర ఎంత తగ్గిందంటే?