వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

Lella Appireddy Arrest : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయానికి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు. అటు నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలు నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ తో పాటు ఇతరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకి సంబంధించి వైసీపీ నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. గత రాత్రి వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో పోలీసులు ఆయనను విచారించారు. అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Also Read : మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు..

ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీసుపై ఎందుకు దాడి చేశారు? దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరు ప్రేరేపించారు? అనే కోణంలో పోలీసులు లేళ్ల అప్పిరెడ్డిని విచారించే అవకాశం ఉంది.