Gold Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. కిలో వెండిపై రూ. రెండు వేలు పెరిగింది. దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,310.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,350 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,460.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,200 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.73,310.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,200 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,310 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.92,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.92,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 87,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 83,000 వద్ద కొనసాగుతుంది.

Gold

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.