Guava Cultivation : లేతజామ తోటల్లో పేనుబంక ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Guava Cultivation : ప్రస్తుతం లేత తోటల్లో రసంపీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది.

Guava Cultivation : లేతజామ తోటల్లో పేనుబంక ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Guava Cultivation

Guava Cultivation : ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్లతోటలు. జామనే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుండే  మంచి దిగుబడితో, రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ప్రస్తుతం లేత తోటల్లో రసంపీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్.

పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామపండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్‌ఉండటంతో రైతులు పలు జామ రకాలను సాగుచేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు.

సాగులో అందివస్తున్న నూతన శాస్త్రపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు . ముఖ్యంగా జామ ఏడాదికి మూడు పంటలు వస్తాయి. ప్రస్తుతం  లేత తోటల్లో పేనుబంక తాకిడి వల్ల తోటలు ఎదుగుదల లేక రైతులు నష్టపోతున్నారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా , వైరా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్.

Read Also : Global Bio Conference : హైదరాబాద్ గ్లోబల్ బయో ఇండియా సదస్సు