ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..

ఆ కౌంటర్ వెయిట్ కు కాకుండా నేరుగా కాలమ్ ను బోట్లు ఢీకొట్టి ఉంటే ఏమై ఉండేది?

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..

Prakasam Barrage Boats Incident : ప్రకాశం బ్యారేజీకి వరద వస్తుంటే బోట్లను ఎవరు వదిలారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ రంగులు ఉన్న బోట్లు అక్కడికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మొత్తం ఐదు బోట్లు వచ్చాయని, అందులో మూడు బోట్లు బ్యారేజీకి తగిలితే కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయని వెల్లడించారు. బోట్లు ఎలా వచ్చాయో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Also Read : ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటన కేసులో సంచలన విషయాలు..!

”11 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వస్తుంటే వైసీపీ రంగులతో ఉన్న బోట్లు, వాళ్లు అనుచరులు అన్నీ కృష్ణా నదిలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? బోట్లు ఎలా వస్తాయి? ఒక్కో బోటు 30 మెట్రిక్ టన్ను బరువు ఉంది. మొత్తం 5 వచ్చాయి. ఒకటి కొట్టుకుపోయింది. మరొకటి ఎక్కడుందో తెలీదు. మూడు బోట్లు వచ్చి ఢీకొడితే బ్యారేజీకి సపోర్టింగ్ గా ఉన్న కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కు కాకుండా నేరుగా కాలమ్ ను బోట్లు ఢీకొట్టి ఉంటే ఏమై ఉండేది? 11 లక్షల 25 వేల క్యూసెక్కుల నీరు అంటే.. ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.