Chilli Cultivation : మిరపతోటల్లో ముడత తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి .  పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత  వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Chilli Cultivation : మిరపతోటల్లో ముడత తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Chilli Cultivation

Chilli Cultivation : తెలుగు రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన వాణిజ్యపంట  మిరప.  వివిధ ప్రాంతాల్లో 30 నుండి 40 రోజుల దశలో ఉంది. మొక్కల్లో కొమ్మలు సాగి ఇప్పుడిప్పుడే పూత వస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న చిరు జల్లులు, మబ్బుల వాతారణం కారణంగా రసంపీల్చు పురుగులు ఆశించటంతో, ముడత తెగులు  ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ తెగులు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. రసంపీల్చు పురుగుల నివారణకు రైతులు పాటించాల్సిన మెలకువలను గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. ఏ. వెంకట్ రెడ్డి.

READ ALSO : Kandi Cultivation : కందిలో పెరిగిన చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు, ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని సాగుచేశారు. వివిధ ప్రాంతాల్లో మిరప 30 నుండి 40 రోజుల దశలో ఉంది. కొమ్మలు శాఖీయంగా అభివృద్ధి చెంది, పూత వచ్చే పరిస్థితుల్లో పైరు ఉంది. అయితే  ప్రస్తుత పడుతున్న చిరు జల్లులు, మబ్బు వాతావరణం కారణంగా మిరపలో ముడత తెగులు ఆశించింది. ఇటు రైతులు పంట పొలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పురుగు మందులు పిచికారి చేయలేకపోతున్నారు.  దీంతో మిరపలో ముడత తెగులు ఉధృతి పెరుగుతోంది.

READ ALSO : Mixed Flour : కలిపిన చపాతీ, పూరీ పిండిని మర్నాడు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

ముఖ్యంగా ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి.  పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత  వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి  ఈ కీలక దశలో ఈ రెండు పురుగులను అరికట్టినట్లైతే , పైరు ఎదుగుదల బాగా ఉండి, మంచి దిగుబడులను సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డా. ఏ. వెంకట్ రెడ్డి.

READ ALSO : Chilli Cultivation : మిరపలో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

తెల్లనల్లి పురుగుల ద్వారా కింది ముడత ఆశిస్తుంది. ఇది ఆశించిన ఆకులు తిరుగబడిన పడవ ఆకారంలో కనబడుతాయి. దింతో దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగుల నుండి పైరును కాపాడుకోవాలి.