Chilli Nursery Management : నాణ్యమైన మిరప నారు కోసం నారుమడిలో మేలైన యాజమాన్య పద్ధతులు

తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు,  ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు.

Chilli Nursery Management : నాణ్యమైన మిరప నారు కోసం నారుమడిలో మేలైన యాజమాన్య పద్ధతులు

Chilli Nursery Management

Chilli Nursery Management : మన దేశంలో మిరప ప్రధాన వాణిజ్య పంట . దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంది . ఆరున్నర లక్షల టన్నుల దిగుబడి వస్తోంది . విస్తీర్ణం , ఉత్పత్తి , వినియోగంలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది.

READ ALSO : Mirchi Cultivation : ఏడాది పొడవునా పచ్చిమిర్చి సాగు.. మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు

ఉత్పాదకతలో హెక్టారుకు 1. 9 టన్నుల దిగుబడితో ద్వితియ స్థానంలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సాగుచేస్తున్నప్పటికి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతుంది. అలాంటి మిరప వర్షాధారంగా సాగుచేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు లాం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. శారద.

READ ALSO : Chilli Crop : వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు!

తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు,  ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిరప 1 లక్షా34 వేల 960 ఎకరాలలో రైతులు సాగుచేస్తుండగా 7 లక్షల 39 వేల 620 టన్నుల దిగుబడివస్తుంది.

READ ALSO : Cultivation Of Mirchi Crop : లాభదాయకంగా పచ్చిమిర్చి సాగు

తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగుచేసే రైతులు జులై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు . ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారుపెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు  లాం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. శారద.

READ ALSO : Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

నీటి వసతి ఉండి సారవంతమైన నేలల్లో నారును పెంచుకుంటే నాణ్యమైన నారు పెరిగేందుకు దోహద పడుతుంది. అలాగే కొంచెం పాక్షికంగా నీడు ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచి నారు వచ్చి అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశముంటుంది.