చిరు ఇంట్లో సందడి చేసిన పవన్ భార్య.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 05:57 AM IST
చిరు ఇంట్లో సందడి చేసిన పవన్ భార్య.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడే సందడి. ఆ సందడికి కారణం చిరు మనవరాలు. అదేనండి.. చిన్న కూతురు శ్రీజ – కళ్యాణ్ దేవ్ ల ముద్దుల కూతురు నవిష్క అన్నప్రాసన కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో మరో స్పెషల్ ఏంటంటే.. పవన్ భార్య అన్నా లెజినోవా తన కొడుకుతో పాటుగా వేడుకలకు హాజరై సందడి చేశారు.

శ్రీజ…గ‌త ఏడాది క్రిస్మస్ రోజు పండంటి పాపకు జ‌న్మ‌నిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాప‌కి న‌విష్క అని పేరు పెట్టారు. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం. ఈ సందర్భంగా జూన్ 19న చిరు నివాసంలో ఈ చిన్నారి అన్నప్రాసన జ‌రిగింది. ఆ వేడుక‌కి మెగా ఫ్యామిలీ అంతా కలిసి తెగ సందడి చేశారు. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నాలెజ్‌నోవా తన కొడుకు మార్క్‌ శంకర్‌ ఈ వేడుక‌ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. 

ఈ వేడుకల్లో చిరు త‌న మ‌నుమ‌రాల‌ని ఎత్తుకొని ముద్దాడుతూ తెగ మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ప్రస్తతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున చిరు నటించిన  ‘సైరా’ విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.