ఎండలో తిరగొద్దని, తల్లి మందలించిందని 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య

అనంతపురంలో విషాదం నెలకొంది. చిన్న కారణానికే ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 07:52 AM IST
ఎండలో తిరగొద్దని, తల్లి మందలించిందని 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య

అనంతపురంలో విషాదం నెలకొంది. చిన్న కారణానికే ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి

అనంతపురంలో విషాదం నెలకొంది. చిన్న కారణానికే ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మందలించిందనే మనస్తాపంతో 11ఏళ్ల బాలుడు ఉరేసుకున్నాడు. నగరంలోని రాంనగర్ కు చెందిన నారాయణ స్వామి, లక్ష్మి దంపతులకు ఇద్దరు(ఓ పాప, బాబు) సంతానం. వారి కుమారుడే రోహిత్. మంగళవారం(మే 26,2020) బాత్ రూమ్ లో రోహిత్ ఉరేసుకున్నాడు. రోహిత్ స్థానిక స్కూల్ లో 6వ తరగతి చదువతున్నారు. కాగా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న రోహిత్ ఎక్కువ సేపు ఎండలో తిరిగేవాడు. వీధిలో ఆటలు ఆడేవాడు. దీంతో ఎండ ఎక్కువగా ఉంది బయట తిరగొద్దని రోహిత్ ను తల్లి మందలించింది. ఎప్పుడూ ఆటలేనా, కాసేపు చదువుకోవచ్చు కదా అని మండిపడింది.

తల్లి అరిచిందని బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరి:
తల్లి మందలింపుతో మనస్తాపానికి గురైన రోహిత్ ఇంట్లో బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. బాత్ రూమ్ నుంచి కొడుకు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కంగారు పడిన తల్లి బాత్ రూమ్ దగ్గరికి వెళ్లింది. లోపలి నుంచి గడియ ఉండటంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా కొడుకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె షాక్ కి గురైంది. 

నిండా 11ఏళ్లు కూడా లేవు, అప్పుడే ఇలా:
రంగంలోకి దిగిన నాలుగో పట్టణ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లి మందలించిందని 11ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకోవడం స్తానికంగా సంచలనంగా మారింది. మరీ ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల వారిని కూడా కంట తడి పెట్టించింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, త్వరలోనూ పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మొత్తంగా బాలుడి క్షణాకావేశం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది. నిండా 11ఏళ్లు కూడా లేని బాలుడు అర్థాంతరంగా జీవితాన్ని చాలించిన ఘటన తీవ్ర విషాదం నింపింది.

మంచి మాటలు చెప్పడమే తల్లిదండ్రుల తప్పా?
బాగా చదువుకోవాలని చెప్పినా, అల్లరి చేయకూడదని తల్లిదండ్రులు అరిచినా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పినా పిల్లలకు చిర్రెత్తుకొస్తోంది. మనస్తాపంతో పిల్లలు క్షణికావేశానికి లోనవుతున్నారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుని కన్నవారికి గర్భశోకం మిగులుస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు అరిచినా, మందలించినా, మండిపడినా అది మన మంచి కోసమే అని పిల్లలు తెలుసుకోవాలి.

rohit

Read: దారుణం.. 9ఏళ్ల బాలికను మల్లెతోటలోకి తీసుకెళ్లి 14ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం, హత్య