భారత్‌లో 47కు చేరిన కరోనా కేసులు…పంజాబ్, కర్ణాటకలోనూ వైరస్ విస్తరణ

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్‌లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్‌లో బాధితుల సంఖ్య 47కు చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 05:50 AM IST
భారత్‌లో 47కు చేరిన కరోనా కేసులు…పంజాబ్, కర్ణాటకలోనూ వైరస్ విస్తరణ

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్‌లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్‌లో బాధితుల సంఖ్య 47కు చేరింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్‌లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్‌లో బాధితుల సంఖ్య 47కు చేరింది. ఈ రెండు కేసుల్లో ఒకరు అమెరికా నుంచి వచ్చిన బెంగళూరు వాసి కాగా.. మరొకరు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.

కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా 
కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి ఇటీవలే ఇటలీ వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌కు చెందిన ఓ మహిళకూ కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఆ మహిళ ఇటీవల ఇరాన్‌ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలతో పాటు ఎప్పటికప్పుడు ఆయా భాషల్లో తగిన సూచనలు ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు 
తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో బాధిత యువకుడు కోలుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిరోధక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉన్న అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా నెగిటివ్‌ వచ్చినట్లు తేలింది. అయితే మరోసారి నిర్ధారణకు అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్లు సమాచారం. అక్కడినుంచి నివేదిక నెగెటివ్‌ అని వస్తే సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేసే అవకాశముంది. ఇక కరోనా వైరస్‌ నేపథ్యంలో నేడు వైద్యారోగ్య శాఖ సమీక్ష చేపట్టనుంది. 

కరోనాపై అవగాహన కోసం తెలంగాణ సర్కార్‌ చర్యలు 
కరోనాపై ప్రజల్లో అవగాహన కోసం తెలంగాణ సర్కార్‌ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజధాని నగరంలో వివిధ కూడళ్లలో భారీ హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసింది. బస్సు, రైల్వే, మెట్రోస్టేషన్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు సైతం ప్రజలకు కరోనాపై అవేర్‌నెస్‌ కల్పిస్తున్నారు. 

డయల్‌ చేయగానే 1 నొక్కి కరోనా కాలర్‌ ట్యూన్ ఎస్కేప్‌ 
కరోనాపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో మొదటిది కాలర్‌ ట్యూన్. ఎవరు ఏ నెట్‌వర్క్‌కు కాల్‌ చేసినా.. దేశంలో ఎక్కడి నుంచి కాల్‌ చేసినా డయలర్‌ ట్యూన్‌లో కరోనా జాగ్రత్తలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా జాగ్రత్తలు అవసరం లేదని భావిస్తే… డయల్‌ చేయగానే 1 నొక్కి ఈ ట్యూన్‌ను ఎస్కేప్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా 
కరోనా వైరస్‌ నేపథ్యంలో.. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా తీవ్రతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 12 దేశాల నుంచి వచ్చిన వారికే ఈ పరీక్షలు చేస్తున్నారు. ఇకపై ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడిని థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌, వైద్య పరీక్షల నిర్వహణను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలించారు. 

ఏపీలో మరో అనుమానిత కేసు 
ఏపీలో మరో అనుమానిత కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా చిన్న బజారుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో.. అతడిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చిత్స అందిస్తున్నారు.

See Also | ఇరాన్ లో కారోనా విజృంభణ : నేడు స్వదేశానికి 58 మంది భారతీయులు