ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు, 58 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : July 28, 2020 / 09:28 PM IST
ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు, 58 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 52,622 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 63,000 మందికి టెస్టులు చేయగా 7,948 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటికే ఆస్పత్రులు ఫుల్ అయ్యాయి.

తూర్పుగోదావరిలో పరిస్థితి అదుపు తప్పింది. దాదాపు 1300 పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా కర్నూలులో కూడా 1100పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులతో కిక్కిరిసిపోయాయి.



సీఎం జగన్ దీనికి సంబంధించి ప్రతిరోజు హైవెల్ కమిటీతో చర్చిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నప్పటికీ బెడ్లు ఖాళీగా లేవు. కోవిడ్ సోకిన వారందరూ స్వంత ఐసోలేషన్ ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం విన్నవించుకుంటుంది.

మరోవైపు అందరికీ కూడా తగిన జాగ్రత్త చర్యలు ఇస్తున్నారు. ఆయా జిల్లాల పరిస్థితుల బట్టి జిల్లాల అధికారులకు లాక్ డౌన్ కు అనుమతి ఇచ్చింది. గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించే విధంగా స్థానిక అధికారులకు ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది. ప్రభుత్వం వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతోంది. ముఖ్యంగా టెస్టింగ్ లకు సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయి.



ఆక్సిజన్ సిలిండర్లు అందకపోవడంతో అనేక మంది మరణిస్తున్నారు. రోజు రోజు కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరినీ హాస్పిటల్స్ లో చేర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా టెస్టింగ్ ల విషయంలో రాజీపడకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.

రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులను తగ్గించే విధంగా మంచి ట్రీట్ మెంట్ అందించే విధంగా కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కృష్ణబాబు ఆధ్వర్యంలో హైలెవల్ టాస్క్ ఫోర్స్ గంటకు గంటకు ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలిస్తున్నారు.