Newlywed Couple Died : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి.. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో వివాహం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో ప్రవళిక, వేణు వివాహ జరిగింది.

Newlywed Couple Died : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి.. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో వివాహం

newlywed couple died

Updated On : February 14, 2023 / 10:02 AM IST

Newlywed Couple Died : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో ప్రవళిక, వేణు వివాహ జరిగింది. వధువుది ఒడిషాలోని బరంపురం కాగా, వరుడిది ఆంధ్రప్రదేశ్ లోని ఇచ్చాపురం. బైక్ పై వధువు గ్రామానికి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒడిశాలోని గొలంత గ్రామం వద్ద ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలంలోనే నవ దంపతులు ప్రవళిక, వేణు చనిపోయారు. సోమవారం (ఫిబ్రవరి13,2023)న ఇచ్చాపురంలోని వరుడి ఇంట్లో వివాహ వేడుకకు సంబంధించిన రిసెప్షన్ జరుపుకుని ఒడిశా రాష్ట్రం బరంపురంలోని వధువు ఇంటికి బైక్ పై వెళ్తున్న సమయంలో గొలంత గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Hubli Bride : పెళ్లింట చావు మేళాలు, పెళ్లయిన నెక్ట్స్ డే వరుడు మృతి

పెళ్లి జరిగిన రెండు రోజులైన కాకముందే నవ దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతన్నారు. ప్రవళిక, వేణు మృతదేహాలను పోస్టుమార్టం కోసం బరంపురం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఎవరి గ్రామానికి వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.