Heart Attacks : హడలెత్తిస్తున్న ‘హార్ట్ ఎటాక్స్’..స్కూల్లో విద్యార్ధులకు పాఠాలు చెబుతునే గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు

ఇటీవల కాలంలో గుండెపోటుతో పోయే ప్రాణాల సంఖ్య పెరుగుతోంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతునే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు ఓ ఉపాధ్యాయుడు. ఆ తరువాత కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరోప్రాంతంలో మరో వ్యక్తి ఇంటినుంచి ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే గుండె పట్టుకుని కుప్పకూలిపోయిన ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో వధువు మెడలో వరమాల వేసిన కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయాడు వరుడు. ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగితే..మరొకటి తెలంగాణలో గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకొకటి బీహార్ లో..ఇలా గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

Heart Attacks : హడలెత్తిస్తున్న ‘హార్ట్ ఎటాక్స్’..స్కూల్లో విద్యార్ధులకు పాఠాలు చెబుతునే గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు

Heart Attack : గుండెపోట్లు ప్రాణాలు హరిస్తున్నాయి. చిన్నగా మొదలైన గుండె పోటు అదేమిటో గుర్తించేలోపే ప్రాణాలు తీసేస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో పోయే ప్రాణాల సంఖ్య పెరుగుతోంది. ఆందోళన కలిగిస్తోంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతునే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు ఓ ఉపాధ్యాయుడు. ఆ తరువాత కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరోప్రాంతంలో మరో వ్యక్తి ఇంటినుంచి ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే గుండె పట్టుకుని కుప్పకూలిపోయిన ప్రాణాలు కోల్పోయారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగితే..మరొకటి తెలంగాణలో గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలంగాణలోని పెదపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ సోదరుడు శైలేంద్రసింగ్ గుండెపోటుతో మరణించారు. అపార్ట్ మెంట్ నుంచి ఉదయం 8.40 నిమిషాల 6 సెకన్లకు బయలుదేరారు శైలేంద్ర సింగ్. ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి తలుపులు వేసి లిఫ్ట్ వద్దకు వెళ్లారు. అప్పటికే గుండెలో ఏదో ఇబ్బందిగా ఉండి అక్కడే గోడకు చేరబడ్డారు. కానీ ఎక్కువ సేపు నిలవలేక అక్కడే కుప్పకూలిపోయారు. కేవలం 40 సెకన్లలో శైలేంద్రసింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

Groom Dies Of Heart Attack : కల్యాణమండపంలో గుండెపోటుతో వరుడు మృతి

అలాగే ప్రతీరోజు స్కూలుకు వెళ్లినట్లే ఉదయం తన స్వగ్రామం అయిన ఇంకొల్లులోని త ఇంటినుంచి బయలుదేరిన వీరబాబు అనే ఉపాధ్యాయుడు స్కూల్ కు చేరుకుని విద్యార్దులకు పాఠాలు చెబుతునే అస్వస్థతకు గురి అయ్యారు. గుండె పట్టుకుని కుర్చీలోనే కుప్పకూలిపోయారు. అలా విద్యార్ధులకు పాఠాలు చెబుతునే గుండె పట్టుకుని కుప్పకూలి మృతి చెందారు. బాపట్ల జిల్లా చీరాల మండటం వాకావారిపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది.క్లాస్ రూమ్ లో విద్యార్ధులకు పాఠాలు చెబుతునే కుర్చీలో కూలబడి గుండెపోటుకు గురి అయి ప్రాణాలుకోల్పోయారు ఉపాధ్యాయుడు వీరబాబు. వీరబాబును వెంటనే చీరాల ఆస్పత్రికి తరలించారు స్కూల్ సిబ్బంది. కానీ అప్పటికే వీరబాబు మరణించారని డాక్టర్లు దృవీకరించారు.

కాగా..బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే  బుధవారం (మార్చి1,2023)  రాత్రి వధూవరులు దండలు మార్చుకున్న కొద్దిసేపటికే వరుడు సురేంద్ర పెళ్లి వేదికపై కుప్పకూలాడు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.

Heart Attack : గుండెకి ఏమైంది? పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు, హార్ట్ ఎటాక్‌కి అసలు కారణం ఏంటి? కరోనా పాత్ర ఎంత?

గుండెపోటు.. ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న పదం. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భయం. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే డిఫరెన్స్ లేదు.. వయసుతో సంబంధమే లేదు. అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు.. ఎవరినీ వదలడం లేదు. ఉన్నట్టుండి సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే, కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.