Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్‌ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Badwel : బద్వేల్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Badwel

Badwel by elections Polling : కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్‌ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బద్వేల్‌లోని బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాల కేంద్రంగా..ఎన్నికల సామాగ్రి పంపిణీ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలివెళుతున్నారు.

బద్వేల్‌లో మొత్తం 281 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది. ఇందులో 221 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలోనూ.. లైవ్ వెబ్‌ టెలికాస్టింగ్‌ ఉంటుంది.

Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ పోటీలు

బద్వేల్‌ బై పోల్‌ డ్యూటీలో మొత్తం 11 వందల 24 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. రెండు వేల మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. లాడ్జీలు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

బద్వేల్‌లో బైపోల్‌ను పకడ్భందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ ఆఫీసర్‌ కేతన్‌గార్గ్‌ అన్నారు. ఎన్నికల ఈవీఎంలు మొరాయించినా ఓటింగ్‌కు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని చెప్పారు.