Anandaiah Medicine: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ

కరోనాపై పోరాటంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత.. ఆనందయ్య మందు నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం(07 జూన్ 2021) నుంచి పంపిణీ చేస్తున్నారు.

Anandaiah Medicine: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ

Anandaiah Medicine Distribution From Today

Anandaiah Medicine: కరోనాపై పోరాటంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత.. ఆనందయ్య మందు నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం(07 జూన్ 2021) నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు.

అయితే, మందుకోసం ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని, పాజిటివ్‌ వచ్చిన బాధితుల ఇళ్లకు మందును పంపిణీ చేస్తామని చెబుతున్నారు ఆనందయ్య. తొలి విడుతలో సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇంటింటికీ పంపిణీ చేస్తుండగా.. ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తారు.

కృష్ణపట్నానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని, అధికారుల వద్ద పేర్ల నమోదు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారమే.. మందు పంపిణీ జరుగుతుందని, ఎలాంటి హడావుడి లేకుండా వాలంటరీల ద్వారా డోర్ టు డోర్ మందు పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ మందును ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావాలని యోచించినా.. అందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా పూర్తికాలేదు. ఆన్‌లైన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే పరిస్థితి ఉంది.

ఆనందయ్య తయారు చేసిన మందులకు ఐదు రకాల పేర్లు పెట్టారు. P, L, F, K ఈ నాలుగింటితో పాటు ఐ డ్రాప్స్‌. అయితే వీటిలో  P, L, F అనే మూడు రకాల మందులను మాత్రమే పంపిణీ చేస్తారు.