అదృష్టవంతుడు.. గూగుల్ పే లో రూ.3వేలు పంపితే రూ.లక్ష రివార్డ్ వచ్చింది

నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 07:36 PM IST
అదృష్టవంతుడు.. గూగుల్ పే లో రూ.3వేలు పంపితే రూ.లక్ష రివార్డ్ వచ్చింది

నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్

నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో(Google Pay) స్క్రాచ్ కార్డు ద్వారా రూ.లక్ష రివార్డ్ వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది. అతడి పేరు సూర్యప్రకాశ్‌. ఫొటో స్టూడియో నడుపుకుంటున్నాడు. 

సూర్యప్రకాశ్ ఓ వ్యక్తికి తన ఫోన్ లో గూగుల్ పే నుంచి రూ.3వేలు పంపాడు. దాంతో అతడికి స్క్రాచ్ కార్డు రూపంలో రివార్డ్ వచ్చింది. దాన్ని స్క్రాచ్ చేసి చూస్తే.. ఏకంగా లక్ష రూపాయలు రివార్డ్ గా వచ్చింది. రూ.లక్ష రావడంతో సూర్య ఉబ్బితబ్బిబవుతున్నాడు. దీన్ని ఇంకా తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. లక్కీగా వచ్చిన రూ.లక్షతో గోల్డ్‌ లోన్‌ తీరిందని ఆనందం వ్యక్తం చేశాడు.

”ఏడాదిగా గూగుల్ పే వాడుతున్నా. ఇప్పటివరకు రివార్డ్ రూపంలో 107 రూపాయలు వచ్చింది. నా స్నేహితుడు రూ.3వేలు అడిగాడు. అతడికి గూగుల్ పే ద్వారా పంపాను. ఆ వెంటనే నాకు రివార్డ్ రూపంలో లక్ష రూపాయలు వచ్చింది. అది చూసి షాక్ అయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేదు. లక్ష రూపాయలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. గోల్డ్ లోన్ క్లియర్ చేశాను” అని సూర్యప్రకాశ్ తెలిపాడు.

1

గూగుల్ పే ద్వారా రివార్డ్ రూపంలో సూర్యప్రకాశ్ కు లక్ష రూపాయలు వచ్చిన వార్త వైరల్ గా మారింది. ఈ న్యూస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సూర్య అదృష్టవంతుడు, జాక్ పాట్ కొట్టాడని అంటున్నారు. 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇప్పుడంతా ఆన్ లైన్ పే మెంట్స్(online digital payments) చేస్తున్నారు. దీంతో గూగుల్‌ పే(google pay), పేటీఎం(paytm), ఫోన్ పే(phonepe) వంటి ఈ వ్యాలెట్ యాప్‌ల(e wallet apps) వినియోగం బాగా పెరిగింది. వ్యాపార, ఉద్యోగ, విద్య, షాపింగ్ ఇలా ఎక్కడ చూసినా వాటిని వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ లో పేమెంట్స్ చేస్తున్నారు. కొన్ని యాప్ లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రివార్డ్స్ రూపంలో క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే పోటీ పడుతున్నాయి. ఎంతో కొంత నగదుని రివార్డ్స్ రూపంలో ఇచ్చి తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి. లాంచింగ్ సమయంలో గూగుల్ పే బంపర్ ఆఫర్లు ఇచ్చింది. చాలామంది రివార్డ్స్ రూపంలో వేల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత బాగా తగ్గింది. కట్ చేస్తే.. అనంతపురం జిల్లాకి చెందిన వ్యక్తి..ఏకంగా లక్ష రూపాయలు రివార్డ్ రూపంలో రావడం హాట్ టాపిక్ గా మారింది.