AP Assembly: ఆరు నెలల తర్వాత.. అసెంబ్లీ నేడే ప్రారంభం.. ఒక్కరోజే!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ(18 నవంబర్ 2021) నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.

AP Assembly: ఆరు నెలల తర్వాత.. అసెంబ్లీ నేడే ప్రారంభం.. ఒక్కరోజే!

Ap Assembly

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ(18 నవంబర్ 2021) నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. ఉదయం 9గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. ముందుగా బీఏసీ సమావేశం జరగనుంది. ఉభయ సభల్లో ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానుంది సర్కార్.

ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తుంది.

Google For India: భారత్‌లో గూగుల్ బిగ్ ఈవెంట్.. నేడే ప్రారంభం!

విద్యాచట్టం, సినిమాటోగ్రఫీ చట్టం, దేవాదాయశాఖ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ, ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌బుక్స్‌ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణతో పాటు పలు ఆర్డినెన్సులను ఆమోదింపజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

Election Results : 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు నేడు