Election Results : 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు నేడు

రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

Election Results : 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు నేడు

Election Results

Updated On : November 18, 2021 / 7:28 AM IST

Election Results :  రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలనుండగా, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.

చదవండి : Kuppam : ప్రజలు బాబుకు దండం పెట్టేశారు : సజ్జల

వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో రెండు పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల లెక్కింపు అంతరాయం ఏర్పడింది. వాయిదాపడిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా గురువారం తేలనుంది.

చదవండి : Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

ఇక బుధవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దర్శి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. 25 స్థానాలున్న కుప్పం మున్సిపాలిటీలో 6 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, 19 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.