Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు.. 28 మంది మృతి

ఏపీలో కరోనా మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 3 వేల 042 మందికి కరోనా సోకింది. 28 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు.. 28 మంది మృతి

Andhra Pradesh Coronavirus

Andhra Pradesh Coronavirus : ఏపీలో కరోనా కేసులు సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 3 వేల 042 మందికి కరోనా సోకింది. 28 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 33 వేల 230 యరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 898 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఏడుగురు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 665 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,08,065 పాజిటివ్ కేసులకు గాను 18,61,937 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో ఏడుగురు, నెల్లూరులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, కడప ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళం ఒకరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 91. చిత్తూరు 358. ఈస్ట్ గోదావరి 665. గుంటూరు 277. వైఎస్ఆర్ కడప 79. కృష్ణా 252. కర్నూలు 51. నెల్లూరు 251. ప్రకాశం 310. శ్రీకాకుళం 116. విశాఖపట్టణం 171. విజయనగరం 61. వెస్ట్ గోదావరి 360. మొత్తం : 3,042