AP Covid : కరోనా పంజా, ఒక్కరోజులోనే.. 10 వేల కేసులు.. 8 మంది మృతి

కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా...

AP Covid : కరోనా పంజా, ఒక్కరోజులోనే.. 10 వేల కేసులు.. 8 మంది మృతి

Ap Corona

Andhra Pradesh Corona : ఏపీ రాష్ట్రంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే భారీగా కేసులు నమోదవుతుండడం అధికార యంత్రాగం కలవర పెడుతోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 వేల కరోనా కేసులు వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మరోసారి కరోనా విరుచుకపడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More : World Tallest Cycle guinness Record: వాడి పారేసిన వస్తువులతో ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌.. గిన్నిస్ బుక్‌ రికార్డ్

కొత్తగా 10 వేల 057 కరోనా కేసులు వెలుగు చూసినట్లు 2022, జనవరి 19వ తేదీ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా…
41 వేల 713 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 935 యాక్టివ్ కేసులున్నట్లు, 14 వేల 522 మంది చనిపోయారని తెలిపింది. కరోనా కారణంగా విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,222 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,19,64,682 శాంపిల్స్ పరీక్షించారు.

Read More : West Bengal Couple : గూగుల్ మీట్‌‌లో అతిథులకు ఆహ్వానం.. జొమాటోలో పెళ్లి భోజనం డెలివరీ

జిల్లాల వారీగా :-
అనంతపురం 861. చిత్తూరు 1822. ఈస్ట్ గోదావరి 919. గుంటూరు 943. కడప 482. కృష్ణా 332. కర్నూలు 452. న నెల్లూరు 698. ప్రకాశం 716. శ్రీకాకుళం 407. విశాఖపట్టణం 1827. విజయనగరం 382. వెస్ట్ గోదావరి 216 : మొత్తం –  10,057