AP Corona : రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు తగ్గిన కరోనా కేసులు

గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 570 కరోనా కేసులు నమోదు కాగా.. శుక్రవారం 470 కరోనా కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News

AP Corona : గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 570 కరోనా కేసులు నమోదు కాగా.. శుక్రవారం 478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శనివారం 396 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక తాజాగా నమోదైన వాటితో కలుపుకొని ఇప్పటివరకు 20,63,177 కేసులు నమోదయ్యాయి.

చదవండి : Corona Cases : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు, 666 మరణాలు

మరోవైపు శనివారం కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 14,399కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 566 మంది ఇళ్లకు వెళ్లారు. దీంతో కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 20,43,616 లక్షలకు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 5222 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చదవండి : Corona : ఏపీలో 5,398 యాక్టీవ్ కేసులు.. కొత్తగా 478 నమోదు