Controversy In Srisailam : శ్రీశైలంలో అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో.. ధర్మకర్తల మండలి సభ్యురాలు దోపిడీ

శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వరుస వివాదాలు చట్టుముడుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కోసం నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసినట్లుగా మండలి సభ్యులే ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు.

Controversy In Srisailam : శ్రీశైలంలో అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో.. ధర్మకర్తల మండలి సభ్యురాలు దోపిడీ

Srisailam

Updated On : January 21, 2023 / 5:04 PM IST

Controversy In Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వరుస వివాదాలు చట్టుముడుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కోసం నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసినట్లుగా మండలి సభ్యులే ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. వివాదాలకు నిలయంగా శ్రీశైలం పుణ్యక్షేత్రం మారుతోంది. ధర్మకర్తల ముసుగులో సభ్యులు ఆ ధర్మాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు ధర్మకర్తల మండలి సభ్యురాలే దాళారి అవతారమెత్తారు.

మల్లన్న స్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా స్పర్శ దర్శనాలు, అభిషేకాలు చేయిస్తానని.. ఎవరైనా భక్తులు ఉంటే తీసుకరావాలని ధర్మకర్తల మండలి సభ్యురాలు ఒకరు.. మధ్యవర్తులతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వరుస వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి.

Srisailam Devasthanam Scam : శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం

ట్రస్టు బోర్డు లెటర్ ప్యాడ్లతో కొందరు టికెట్లు లేకున్నా అక్రమంగా దర్శనాలకు వెళ్తున్నట్లు
ఇటీవల వెలుగులోకి వచ్చింది. మొన్నీమధ్య లడ్డూ తయారీ ముడిసరుకుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన వ్యవహారం వెలుగు చూసింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాల్సిన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.