Srisailam Devasthanam Scam : శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం

నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది.

Srisailam Devasthanam Scam : శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం

srisaialam

Srisailam Devasthanam Scam : నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది. కాంట్రాక్టర్ ఎక్కువ ధరకు జీడిపప్పు, యాలకులు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కాంట్రాక్టు రద్దుకు పాలక మండలి తీర్మానం చేసింది. కిలో జీడి పప్పుకు రూ.960లను వసూలు చేస్తోన్నారు. కానీ నాణ్యమైన జీడిపప్పును గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రూ.690కే విక్రయిస్తోంది.

కిలో యాలకులను జీసీసీ రూ.1500లకు సరఫరా చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం కాంట్రాక్టర్ రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇతర సరుకులు కూడా ఎక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. కిలో యాలకులను జీసీసీ రూ.1,500 లకే సరఫరా చేస్తుంటే కాంట్రాక్టర్ రూ.4,100 వసూలు చేస్తున్నారని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు. టన్నుల్లో కొనుగోలు చేసే దేవస్థానానికి ఇంకా ధర తగ్గించే అవకాశం ఉండగా అధిక ధర అవుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ రద్దుకు పాలక మండలి తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ ను కొనసాగించారని తెలిపారు.

Ishtakaameswari Devi Secret Temple : నుదుట బొట్టి కోరితే చాలు .. కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి .. శ్రీశైలం దట్టమైన అడవిలో కొలువైన అమ్మవారు

శ్రీశైలంలో లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక్క నెలలోనే లక్షలాది రూపాయాలు గోల్ మాల్ చేసినట్లు సమాచారం అందుతోంది. నవంబర్ నెలలో లడ్డూ తయారీకి సరైన సరుకులు తేకపోవడంతో ఆ ధరల్లో దాదాపు రూ.42 లక్షలు వ్యత్యాసం కనిపించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి చెబుతున్నారు.

లడ్డూ తయారీ కోసం క్వాలిటీ సరుకుల కోసం కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని సెకండ్ క్వాలిటీ సరుకులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అంతర్గతంగా విచారణ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. విచారణ చేసిన అనంతరం ఈ కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి చైర్మన్ తోపాటు కమిటీ సభ్యులు కూడా నిర్ధారణకు వచ్చారు.

Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్‌

కేవలం ఒక నెలలోనే రూ.42 లక్షల అవినీతి జరిగిందంటే గతంలో ఇంకెంత జరిగిందో విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దేవాదాయ, ధర్మదాయ శాఖా అధికారులకు శ్రీశైలం దేవస్థానం పాలక మండలి కమిటీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. సరుకుల కొనుగోలులో జరిగిన అవినీతిపై చైర్మన్ చక్రపాణిరెడ్డి సీరియస్ గా ఉన్నారు.