కోడెల కొడుకు షోరూం లైసెన్స్ రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 04:15 PM IST
కోడెల కొడుకు షోరూం లైసెన్స్ రద్దు

 ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం లైసెన్స్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు గుంటూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. 

 ఆగస్టు-2,201న రవాణా శాఖ అధికారులు షోరూంలో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఆగస్టు 2 వరకు జరిపిన వాహన విక్రయాల్లో అవకతవకలు జరిగి ఎలాంటి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను కట్టకుండానే 1025 వాహనాలను విక్రయించినట్లు గుర్తించిన  అధికారులు షోరూంను సీజ్‌ చేశారు.