AP : అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ, వారు హాజరవుతారా ?

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో...ప్రివిలేజ్‌ కమిటీ విచారణ మొదలుపెట్టనుంది.

AP : అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ, వారు హాజరవుతారా ?

Ap Tdp

Privileges Committee Meeting : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది. కమిటీ ఛైర్మన్‌ కాకాని గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో.. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై వచ్చిన ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో…ప్రివిలేజ్‌ కమిటీ విచారణ మొదలుపెట్టనుంది.

Read More : Kanipakam : వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు, నేడు చిన్న, పెద్ద శేషవాహన సేవలు

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తనను హోం అరెస్ట్ చేయడం, మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించిందుకు తన ప్రివిలేజ్‌కు భంగం వాటిళ్లిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ….నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదుచేశారు. మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌… స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. అచ్చెన్నాయుడు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, నిమ్మల రామానాయుడు సభకు తప్పుడు సమాచారం అందించారని వచ్చిన ఫిర్యాదులపై ప్రివిలేజ్ కమిటీ వద్ద విచారణ ఎదుర్కొంటున్నారు.

Read More : CA Final Exam : చెల్లికి 1, అన్నకు 18.. సీఏలో అదరగొట్టిన అన్నాచెల్లెలు, సీఏ పాస్ అవడమే కష్టమనుకుంటే

విచారణకు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని కమిటి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇంతవరకు నలుగురిలో ఒక్కరు కూడా స్వయంగా విచారణ హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాలు చూపి  విచారణకు హాజరు కాలేదు. పలుమార్లు ఇదే జరిగింది. దీంతో ఈ రోజు జరిగే విచారణకు వీరు హాజరు అవుతారా ? కారా ? అన్నది వేచి చూడాల్సి వుంది.