Andhra pradesh : మాజీ మంత్రుల కోసం కొత్త మంత్రుల అధికారాలకు కోత..! పదవిలో ఉన్నా అధికారం లేనట్లేనా?!

ఏపీ ప్రభుత్వం మాజీ మంత్రుల కోసం కొత్త మంత్రుల అధికారాలకు కోత విధిస్తుందా? పదవిలో ఉన్నా అధికారం లేనట్లేనా అటువంటి విధానాల యోచనలు ప్రభుత్వం ఉందా?!

Andhra pradesh : మాజీ మంత్రుల కోసం కొత్త మంత్రుల అధికారాలకు కోత..! పదవిలో ఉన్నా అధికారం లేనట్లేనా?!

Ap Cabinet Ministers List 2022

Twist in ap cabinet expansion : ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎంతో టెన్షన్ పడ్డారు.. ఎందరో దేవుళ్లకు మొక్కారు.. ఏదైతేనే.. మొత్తానికి జగన్ దృష్టిలో పడ్డారు. కేబినెట్ బెర్త్‌లు దక్కించుకున్నారు. మంత్రులైపోయారు. ఒక్కొక్కరిగా శాఖల బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. రాబోయే రెండేళ్ల పాటు.. తమ తమ జిల్లాలో అంతా తామే అనే ఆశల్లో తేలిపోతున్నారు. ఆశల్లో తేలిపోవడమేంటి? వాస్తవం కూడా అదేగా.. అని మీరనుకోవచ్చు. కానీ.. అధిష్టానం అనుకోవాలిగా. ఇదే.. ఈ కేబినెట్ విస్తరణలో ట్విస్ట్. శాసించే స్థానంలో ఉన్న శాసించలేకపోవడం.. అధికారం ప్రయోగించే అవకాశం ఉన్నా.. ప్రయోగించలేకపోవడం.. ఇంకా చాలా ఉన్నాయ్. అది అర్థం చేసుకోవడానికి ముందు.. తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది.

Also read : Hardik Patel: మా పార్టీలోకి రండి.. హార్దిక్ పటేల్‌కు ఆమ్‌ఆద్మీ పిలుపు

ఏపీలో మంత్రివర్గ విస్తరణ తర్వాత.. 14 మంది మాజీ మంత్రులుగా మిగిలిపోయారు. వారికి.. పార్టీ బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు కేబినెట్ ర్యాంక్ పదవులిచ్చి.. వారి దర్జా తగ్గకుండా చూస్తామని.. జగన్ హామీ ఇచ్చారని.. పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు.. ఈ పని మీదే వైసీపీ అధినాయకత్వం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా చేయబోయే ఈ ప్రయోగం.. ఎలా ఉంటుందన్నదే ఆసక్తిగా మారింది. ఏపీలో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి.. కొత్తగా 26 జిల్లా అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తారనే సమాచారముంది. వీటికి ఛైర్మన్లుగా.. మాజీ మంత్రులతో పాటు మంత్రి పదవులు ఆశించి భంగపడిన వాళ్లతో భర్తీ చేస్తారని.. వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

జిల్లాల్లో.. ఇప్పటివరకు జిల్లా ప్రణాళికా కమిటీలు, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీలు ఉండేవి. వాటి వ్యవహారాలను.. జిల్లా ఇంచార్జి మంత్రులే చూసుకునేవారు. జిల్లాలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా.. ఇంచార్జ్ మంత్రుల సంతకం ఉండాల్సిందే. అదే.. అసలైన పవర్. మొన్నటిదాకా ఉన్న ఇంచార్జ్ మంత్రులంతా.. ఈ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసేవారు. కానీ.. ఇప్పుడీ ఇంచార్జ్ మంత్రుల వ్యవస్థను రద్దు చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అలాగే.. జిల్లా ప్రణాళికా కమిటీలు, అభివృద్ధి సమీక్షా కమిటీల స్థానంలో.. అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి.. వాటికి మాజీ మంత్రులు, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లను నియమించి.. వారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని చర్చ సాగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇంచార్జ్ మంత్రుల హోదా అన్నమాట.

Also read : Telangana : కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా వెనుక పెద్ద రీజనే ఉందట..!

అర్థమైందిగా.. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. కొత్త పదవుల సృష్టి బాగానే ఉన్నా.. దీని వల్ల అధికారాలన్నీ.. కొత్త వ్యవస్థకు పోతే.. కొత్తగా వచ్చిన మంత్రులంతా డమ్మీలవుతారనే చర్చ కూడా సాగుతోంది. పవర్ ఫుల్ పోస్టులో ఉండి.. పవర్ లేకపోతే.. మినిస్టర్ పోస్టులో ఉండి లాభమేంటనే టాక్ వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అయితే.. వారికి-వీరికి.. అధికారాలను బ్యాలెన్స్ చేస్తూ అంతా కలిసుండేలా.. ఒకే వేదికగా దీనిని తీసుకురాబోతున్నారని మరో ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఇలాంటి అభివృద్ధి మండలి గనక ఏర్పాటు చేస్తే.. వాటి ఛైర్మన్లుగా మాజీ మంత్రులను నియమిస్తే.. వాళ్లు కొత్త మంత్రులను కాదని దూసుకెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయ్. అప్పుడు.. జిల్లాలో రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయి. రాజ్యాంగం ప్రకారం చూస్తే.. మంత్రులకు సమాంతరంగా.. ఇతర అధికార కేంద్రాలు ఉండొచ్చా అనే చర్చ కూడా తలెత్తే చాన్స్ ఉంది. అయితే.. ఇవన్నీ దాటుకొని వైసీపీ అధినాయకత్వం చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.