సొంతింటి కల : ఇంటి నిర్మాణానికి సీఎం జగన్ మూడు ఆప్షన్లు

సొంతింటి కల : ఇంటి నిర్మాణానికి సీఎం జగన్ మూడు ఆప్షన్లు

AP CM Jagan Gives 3 Options For House Construction : ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం ఏపీ సర్కార్‌.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. 30 లక్షల 75వేల మంది మహిళలకు అందజేయనుంది. అంతేకాదు.. 15 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. పేదల సొంతింటి కలను జగన్‌ ప్రభుత్వం సాకారం చేయనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…

కాలనీల్లో లే అవుట్లు వేసి..ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా..రాబోయే రోజుల్లో ఈ కాలనీల్లో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇలాంటివంటి వసతులు కల్పించబోతున్నామన్నారు. కాలనీ సైజును బట్టి..పార్కులు, అంగన్ వాడీ, విలేజ్ క్లినిక్స్, స్కూళ్లు..కమ్యూనిటీ హాల్స్ నిర్మించే విధంగా లే అవుట్‌లో పొందుపరిచామన్నారు. 224 చదరపు అడుగులను..340 చదరపు అడుగులతో ఇళ్లు ఉండబోతున్నాయని, 68 వేల 361 ఎకరాల భూమిని లేవుట్లుగా మార్చి..ఇళ్ల పట్టాలుగా పంచబోతున్నట్లు వెల్లడించారు. లే అవుట్లలో ఓ మోడల్ ఇళ్లు కట్టామని, పేదోడికి రూపాయి ఖర్చు కాకుండా..ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఇంట్లో..బెడ్ రూం, లివింగ్ రూం, కిచెన్, వరండా..టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్, ఇంట్లో లైట్లు ఉంటాయన్నారు. 13 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. మొదటి దశ కింద…15 లక్షల 60 వేల ఇంటి నిర్మాణం మొదలు కాబోతోందని, రెండో దశ కింద వచ్చే సంవత్సరంలో 12 లక్షల 70 వేల ఇంటి నిర్మాణాలు వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామని, అదనంగా 2 లక్షల 62 వేల టిడ్కో ఇంటి ప్లాట్స్ కు సంబంధించి పనులు మొదలయ్యాయన్నారు. వీటన్నింటిని పూర్తి చేసి మహిళల చేతుల్లో పెడుతామన్నారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాదు..ఇల్లు కట్టే కార్యక్రమంలో..లబ్దిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తున్నామని, ఏ ఆప్షన్ కావాలని కోరుకుంటే..అలాంటి ఇళ్లను కట్టించడం జరుగుతుందన్నారు.

1. ‘ప్రభుత్వం రూపొందించిన నమూనా మాదిరిగా..ఇంటిని నిర్మించుకోవడానికి నాణ్యమైన నిర్మాణ సామాగ్రీని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. లేబర్ ఖర్చులు లబ్దిదారుల చేతికి ఇస్తుంది.
2. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రీ తెచ్చుకొనే వెసులుబాటు ఇస్తుంది. దశల వారీగా..డబ్బులు ప్రభుత్వం అందిస్తుంది.
3. లబ్దిదారుడు…మీరే కట్టించండి..అంటే..దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కళ్లెదుటే..ఇంటికి సంబంధించి..నాణ్యమైన సామాగ్రీతో ఇంటిని నిర్మించి ఇస్తుంది’. అని సీఎం జగన్ వెల్లడించారు.