AP CM : జగనన్న గోరు ముద్ద, 2 గంటల్లో 50 వేల మందికి భోజనం

వంట శాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్‌ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాల రుచి చూశారు. అనంతరం సీఎం కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు...

AP CM : జగనన్న గోరు ముద్ద, 2 గంటల్లో 50 వేల మందికి భోజనం

Jagan

Akshaya Patra : కేవలం 2 గంటల్లోనే 50 వేల మందికి భోజనం అందించేలా అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది ప్రముఖ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయ పాత్ర ఆహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్..అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను ఆయన ప్రారంభించారు. ఆత్మకూరు వద్ద రూ.20 కోట్లతో దీనిని ఇస్కాన్ ఏర్పాటు చేసింది. కేవలం 2 గంటల్లోనే 50వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా దీన్ని నిర్మించారు. వంట శాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్‌ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాల రుచి చూశారు. అనంతరం సీఎం కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. రూ. 70 కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ధ్యాన కేంద్రాలు, యువతకు శిక్షణనిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Read More : Rivers Link : గోదావరి -కావేరీ అనుసంధానం.. ఓకే చెప్పిన తెలుగు రాష్ట్రాలు.. కండీషన్స్ అప్లయ్

అంతకంటే ముందు… ఉదయం 11.10 గంటలకకు శంకుస్థాపన ప్రాంగణానికి సీఎం చేరుకున్న తర్వాత.. ఇస్కాన్ ప్రతినిధులు జగన్ నుదుటిపై నామం దిద్ది, శాలువా కప్పి స్వాగతం పలికారు. భూవరహఆ స్వామి యజ్ఞంలో పూర్ణాహుతి చేసిన సీఎం గోకుల క్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూజలు చేసిన అనంతరం భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్రీకృత వంటశాల ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ కు గుంటూరు జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీరంగనాథ రాజు, మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. పాఠశాలలకు ఆహారాన్ని రవాణా చేసే వాహనాలు సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు బృందావన చంద్రోదయ మందిర్ ఛైర్మన్ మధు పండిట్ దాస్, హరేకృష్ణ ఉద్యమం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.