CM Jagan : సీఎం జగన్ సీరియస్.. మురికి కాల్వల వెంట అధికారుల పరుగులు

ఏపీ సీఎం జగన్ కు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అంతే, మురికి కాల్వల వెంట అధికారులు పరుగులు తీశారు. అసలేం జరిగిందంటే..

CM Jagan : సీఎం జగన్ సీరియస్.. మురికి కాల్వల వెంట అధికారుల పరుగులు

Cm Jagan

CM Jagan : ఏపీ సీఎం జగన్ కు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అంతే, మురికి కాల్వల వెంట అధికారులు పరుగులు తీశారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా బటయకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతారు.

ఈ క్రమంలో తాడేపల్లి, గన్నవరం మధ్య చాలా సార్లు ప్రయాణించారు. ఇటీవల తిరుపతి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా విజయవాడలోని ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల దగ్గరికి రాగానే తీవ్ర దుర్గంధం వచ్చింది. వెంటనే సమస్యపై సీఎంఓ అధికారులను ప్రశ్నించారు. అక్కడ సమస్యేంటో కనుక్కోవాలని ఆదేశించారు.

CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి

సీఎం ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద వచ్చారు. మురికి కాల్వల నుంచి ఆ దుర్గంధం వస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని సీఎంకి చెప్పారు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎంవో ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కార్యదర్శులు, కలెక్టర్ ఆ ప్రాంతాలను పరిశీలించారు. పక్కా డ్రైనేజీ నిర్మించాలని సూచించారు.

Amaravathi: అమరావతి.. రైతులకే కాదు.. ఏపీ ప్రజలందరికీ రాజధాని.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

స్థానికంగా ఉన్న డ్రెనేజీ సమస్య, ఇతర అంశాలను స్థానికుల నుంచి అధికారులు అడిగి తెలుసుకున్నారు. చాన్నాళ్లుగా డ్రెనేజీ సమస్య వేధిస్తోందని పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఏకంగా ముఖ్యమంత్రే సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.