AP PRC Issue : పీఆర్సీ జీవోల దగ్ధం.. సర్కార్‌‌పై కస్సుబుస్సు

గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్ లో పీఆర్సీ కాపీ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

AP PRC Issue : పీఆర్సీ జీవోల దగ్ధం.. సర్కార్‌‌పై కస్సుబుస్సు

Ap Prc

AP Employees Fires On PRC : ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు కస్సుబుస్సుమంటున్నారు. పీఆర్సీపై మండిపడుతున్నారు. వెంటనే..మరోసారి ఉద్యోగులకు అనువైన పీఆర్సీని ప్రకటించాలని మరోసారి గళమెత్తుతున్నారు. 2022, జనవరి 19వ తేదీ బుధవారం గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్ లో పీఆర్సీ కాపీ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పీఆర్సీ ఆమోదయోగం కాదని తేల్చిచెబుతున్నారు.

Read More : SS Rawat : రాష్ట్ర విభజనతో లక్షల కోట్ల ఆదాయం కోల్పోయాం

ఏపీలో పీఆర్సీ రగడ మళ్లీ రాజుకుంది. హెచ్‌ఆర్‌ఏ, డీఏల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు పోరుబాటకు రెడి అయిపోయారు. సర్కార్‌పై సమరభేరీ మోగించారు. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెనక్కి తీసుకోకపోతే.. సమ్మెకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. వరుసగా ఉద్యోగ కమిటీ…సమావేశాలు నిర్వహించారు నేతలు. వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం బ్లాక్ బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Read More : world first skull surgery : 2,000 ఏళ్ల క్రితమే పుర్రెకు సర్జరీ..

సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం ప్రకటిస్తామన్న ఏపీ ప్రభుత్వం.. తమను సంప్రదించకుండా జీవోలను విడుదల చేసిందంటూ మండిపడ్డారు ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70, 75 ఏళ్ల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌ విషయంలోనూ అన్యాయం జరిగిందన్నారు. పీఆర్సీ సాధన కోసం సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ, HODలలో పనిచేసే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం స్పందించి తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం తప్పదన్నారు.

Read More : CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

ఇదిలా ఉంటే…ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క ఉద్యోగికి సంబంధించి గ్రాస్ శాలరీ ప్రభుత్వం తగ్గించలేదని, ప్రస్తుతం రెండు వైరస్ ల కారణంగా..రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకోవాలన్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు.