SS Rawat : రాష్ట్ర విభజనతో లక్షల కోట్ల ఆదాయం కోల్పోయాం

హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.

SS Rawat : రాష్ట్ర విభజనతో లక్షల కోట్ల ఆదాయం కోల్పోయాం

Ss Rawat

SS Rawat : పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ స్పందించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామని రావత్ అన్నారు. మనది నూతన రాష్ట్రం అని, చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజనలో చాలా కోల్పోయమని తెలిపారు. తలసరి ఆదాయం మనకంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ అని
చెప్పారు.

CS Sameer Sharma : ఏ ఒక్క ఉద్యోగి గ్రాస్ శాలరీ తగ్గించ లేదు

”హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. శానిటరీ వర్కర్స్, ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోమ్ వర్కర్స్ కు సీఎం జగన్ జీతాలు పెంచారు. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఏర్పాటు
చేశారు. కుటుంబానికి అయినా రాష్ట్రానికి అయినా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటుంది. వాటిని పరిమితంగానే వినియోగించుకోవాలి. అందులో సవాళ్లు ఉంటాయి.

ఉద్యోగులు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు ఆర్ధిక వనరులు పంచాలి. కోవిడ్ పరిస్థితులల్లో చాలా ప్రభుత్వాలు సంక్షేమ బడ్జెట్ లో కోత పెట్టాయి. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం.

Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్

ఉద్యోగులు ఎవరూ బాధ పడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం. విభజన నుంచి కరోనా వరకు రాష్ట్ర ఆర్ధిక వనరులు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారి పోయింది. పరిశ్రమలు, సర్వీసుల రంగం ఒడిదొడుకులకు లోనైంది. రాజధాని లేని కారణంగా 2015 -20 వరకు రూ.1.80 లక్షల కోట్ల మేర రెవెన్యూ కోల్పోయాం” అని రావత్ అన్నారు.