AP : ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ

ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ కావటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

AP : ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ

Anil Kumar Meets Mla Kotamreddy Sridhar Reddy

Anil Kumar Meets MLA Kotamreddy Sridhar Reddy  :  CM జగన్ కేబినెట్ పునర్వవస్థీకరణ నెల్లూరులో ఆసక్తికర పరిణామాలకు దారి తీసింది. రెండోవ విడతలో మంత్రి ప‌ద‌వి దక్క‌ుతుందని ఆశించి భంగపడినవారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మొదటిసారి మంత్రి అయ్యి రెండోసారి కూడా కొనసాగుతామని ఆశించినవారు భంగపడి అసంతృప్తులకు గురి అవుతున్నారు. ఈక్రమంలో నెల్లూరు వైసీపీలో ఆసక్తికర భేటీలు జరుగుతున్నాయి. మంత్రి పదవి దక్కని బాధ‌లో కోటంరెడ్డి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఉంటే..రెండోవిడత కూడా తననే మంత్రిగా కొనసాగిస్తారని ఆశపడిన అనిల్ కుమార్ యాదవ్ రెండోసారి అవ‌కాశం చేజారింద‌న్న మ‌న‌స్తాపంలో ఉన్నారు. అయితే వీరిద్ద‌రితో విభేదాలు ఉన్న స‌ర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డికి మంత్రిగా అవ‌కాశం ద‌క్కటంతో వీరిద్దరికి రుచించటంలేదు. దీంతో ఈ క్రమంలో కోటం రెడ్డి, అనిల్ కుమార్ భేటీ నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో పెను ఆసక్తిని రేపుతోంది.

సీఎం జగన్ చేసిన మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతల మధ్య విబేధాలు బహిరంగంగానే కన్పిస్తున్నాయి.వారి వారి అసంతృప్తులు బహిరంగమవుతున్నాయి. ఇప్పటివరకు అంతర్గతంగా నేతల మధ్య ఉన్న బేదాభిప్రాయాలు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణతో బయటపడిపోయాయి. కొత్త మంత్రికి పొసగని ఎమ్మెల్యేలు సమావేశం కావడం చర్చకు దారి తీసింది.

Also read : AP: నెల్లూరులో మంత్రి కాకాణి ఫ్లెక్సీల కాక.. అనిల్ కుమార్ యాదవ్ పై ఆగ్రహం

నేతల మధ్య ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నవిబేధాలు బహిరంగమయ్యాయి. నెల్లూరు జిల్లా నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో జగన్ స్థానం కల్పించారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఆయనతో పడని వర్గాలు అసంతృప్తితో కొట్టుకులాడిపోతున్నారు. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి ఓదార్చారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు.ఈ సమయంలో గురువారం నాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఆహ్వానం రానందునే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని..పైగా తనకు ఆరోగ్యం బాగుండగా టెస్ట్ ల కోసం వెళ్లానని అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఎలా సహకరించారో అంతకు రెట్టింపు సహకరిస్తానని కూడా అనిల్ కుమార్ వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం వారిద్దరి మధ్య ఏమాత్రం అభిమానాలు ఉన్నాయో తేటతెల్లమవుతోంది.

Also read : Andhra Pradesh : అలకవీడని మాజీ హోంమంత్రి సుచరితపై సీఎం జగన్ ఆగ్రహం..తీరు మారకుంటే చర్యలు తీసుకునే అవకాశం

గత టర్మ్ లో అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు పరోక్షంగా అనిల్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో నెల్లూరు జిల్లాకు చెందిన నేతలను సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు. కానీ అవన్నీ పైపైకే. లోపల అంతా కుట్రలు కుతంత్రాలే.

కాకాణి గోవర్ధన్ రెడ్డికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య కూడా గ్యాప్ ఉంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వీరి భేటీపై నెల్లూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ సాగుతుంది. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ కావడం కూడా చర్చకు దారితీసింది.

Also read : Mekathoti Sucharita : రాజీనామా చేయలేదు.. కృతజ్ఞతా లేఖను రాజీనామాగా ప్రచారం చేశారు: మాజీ హోంమంత్రి సుచరిత

మంత్రిగా ప్రమాణం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రమేయం ఉందని కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గం విరుచుకుపడింది. ఏప్రిల్ 17వ తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు. అదే రోజున అనిల్ కుమార్ కార్యకర్తలతో సమావేశం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం కూడా ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. కోటం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ల భేటీ నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.