Government Orders : ఏపీ ప్రభుత్వ జీవోలకు ‘ఈ-గెజిట్’

ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ-గెజిట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Government Orders : ఏపీ ప్రభుత్వ జీవోలకు ‘ఈ-గెజిట్’

Ap Govt

AP govt e-Gazette : ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏపీ ఈ-గెజిట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం (సెప్టెంబర్8, 2021) ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ఈ-గెజిట్ లో ఉత్తర్వులను ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జీవో ఐఆర్‌ వెబ్‌సైట్‌ నిలిపివేసినందున ఉత్తర్వులను ఈ-గెజిట్‌లో ఉంచనున్నట్లు వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను అందులో ఉంచనున్నట్లు పేర్కొంది.

ప్రజలకు అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యత వంటి తదితర అంశాలను ఈ-గెజిట్ లో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకనుంచి అధీకృత అధికారి డిజిటల్‌ సంతకంతో అన్ని జీవోలు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.