Payyavula Keshav: టీడీపీ నేత పయ్యావులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Payyavula Keshav: టీడీపీ నేత పయ్యావులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

Payyavula

Payyavula Keshav: టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కావాలనే పయ్యావులను ఇబ్బందులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Viral Video: శ్రీలంక అధ్యక్షుడి బెడ్‌‌రూంలో యువకులు కుస్తీ పోటీ.. వీడియో వైరల్‌..

పీఏసీ చైర్మన్ గా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్ కు 1+1 గన్ మెన్ల భద్రత ఉండేది. తనకు సెక్యూరిటీని పెంచాలని కొద్దిరోజుల క్రితం పయ్యావుల ప్రభుత్వానికి లేఖ రాశారు. సెక్యూరిటీ పెంచకపోగా.. ఉన్న గన్ మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి కేశవ్ కౌంటర్ ఇచ్చా రు. దాన్ని జీర్ణించుకోలేకనే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించారంటూ తెలుగుదేశం ఆరోపిస్తోంది.
YS Jagan: 13న సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇలా..

టీడీపీ చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రజాప్రతినిధులకు కేటాయించే గన్ మెన్లను ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్లను ఉపసంహరించారని, త్వరలోనే కొత్తవారిని నియమిస్తారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. టీడీపీ నేతలు ఈ విషయంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.