Viral Video: శ్రీలంక అధ్యక్షుడి బెడ్‌‌రూంలో యువకులు కుస్తీ పోటీ.. వీడియో వైరల్‌..

అధ్యక్ష భవనంలోకి వెళ్లిన ఆందోళన కారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూంలో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: శ్రీలంక అధ్యక్షుడి బెడ్‌‌రూంలో యువకులు కుస్తీ పోటీ.. వీడియో వైరల్‌..

Sri Lanka (1)

Viral Video: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెట్రోల్ కోసం రోజుల తరబడి బంక్ ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తినేందుకు కూడా సరియైన ఆహారం లభించడం లేదు. గత ఐదు నెలలుగా దేశంలో ఇవే పరిస్థితులు. దీంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా శనివారం వేలాది మంది ఆందోళనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అధికారిక నివాసంను ముట్టడించారు. భద్రతా సిబ్బందిని నెట్టుకుంటూ అధ్యక్ష భవనంలోకి ఆందోళన కారులు ప్రవేశించారు. పరిస్థితి అదుపు తప్పడంతో గొటబయ రాజపక్సే అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. అయితే ఆయన విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.

Sri Lanka Crisis: గొటబయ నివాసంలో రహస్య బంకర్.. అందులో నుంచే పారిపోయాడా!

అధ్యక్ష భవనంలోకి వెళ్లిన ఆందోళన కారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూంలో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భవనంలోని బెడ్ రూంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. ప్రధాని నిద్రించే బెడ్‌పైకి ఎక్కి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో నివాసంలోపల అధ్యక్షుడు నిద్రించే బెడ్‌పై యువకులు గుంపులుగా ఉండటం కనిపిస్తుంది. వారు బెడ్ పై కుస్తీ పోటీలు నిర్వహించారు. రియల్ గా జరిగే కుస్తీ పోటీలవలే ఒకరిపై ఒకరు దాడిచేసుకోవటం కనిపించింది.