Omicron : ఒమిక్రాన్ ముప్పు.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Omicron : ఒమిక్రాన్ ముప్పు.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Omicron

Omicron : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఒమిక్రాన్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కొత్త వేరియంట్ పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

మంత్రి, అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. మందులు, ఆసుపత్రుల్లో బెడ్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని గుర్తించి వారికి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?