Salary Hike : భారీగా వేతనాలు పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి

Salary Hike : భారీగా వేతనాలు పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

Salary Hike

Salary Hike : దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అదే విధంగా ఇమాంలకు ప్రస్తుతమున్న రూ.5 వేలను రూ.10 వేలకు, మౌజంలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చర్చి ఫాదర్లకు గతంలో ఎలాంటి గౌరవ వేతనం లేదు. ఇప్పుడు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో మతసమరస్యాన్ని మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ వరుసగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు. కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇచ్చిన మాటను నిలుపుకుంటున్నారు. ఇటీవలే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. రైతుల ఖతాల్లోకి డబ్బులు వేశారు. ఇప్పుడు అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.