AP Legislative Council : రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు శాసనమండలి ఆమోదం

ఇక.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు.

AP Legislative Council : రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు శాసనమండలి ఆమోదం

Ap Council

Capital Decentralization Bill : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
అమరావతి

ఇక.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

Kondapalli Municipal : నేడే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన ఏపీ ప్రభుత్వం… మరో అంశంలోనూ యూటర్న్ తీసుకోవాలని డిసైడైంది. సమస్యలు రాకుండా చూసుకోవడం.. రాజకీయంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఈ నిర్ణయాల వెనుక కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ గతంలో కేంద్రానికి పంపిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. ఈ నిర్ణయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి మళ్లీ పంపేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.