Kodali Nani: నా గురించి మాట్లాడితే.. మీ సంగతి బయటపెడతా..!

కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.

Kodali Nani: నా గురించి మాట్లాడితే.. మీ సంగతి బయటపెడతా..!

Kodali Nani

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు అంటే ఏంటో చూపిస్తామని అంటున్న బీజేపీ నేతల తీరు సరికాదని అన్నారు. గోవా కల్చర్ ను గుడివాడకు తీసుకువచ్చారని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. అక్కడ నడుస్తున్న కాసినోలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు.

గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని.. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని.. అంతే కాక.. గోవా భారతదేశంలోనే ఉందని కొడాలి నాని చెప్పారు. గోవాలో ఎందుకు కాసినోలను నిషేధించలేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపైనా.. ఎదురుదాడి చేశారు కొడాలి నాని.

చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా వచ్చి సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ చేశారు. గుండాటను చూసి కాసినో అని చెప్పే పార్టీ టీడీపీ అని ఆరోపణలు గుప్పించారు. టీడీపీలో ఉన్నప్పుడు తాను నీతివంతుడిని.. వైసీపీలో ఉంటే అవినీతిపరుడిలా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు.

టీడీపీ, బీజేపీ నేతలు.. గవర్నర్ ను కలిస్తే తనకేం ఇబ్బంది లేదన్న కొడాలి నాని.. అవసరమైతే ఈ విషయంలో రాష్ట్రపతిని కలిసినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు.. తనపై విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు. గతంలో చంద్రబాబు వల్ల ఇబ్బంది పడిన వాళ్లంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని.. వాళ్లతో కేసులు పెట్టించి బడితపూజ చేయడం ఖాయమని నాని హెచ్చరించారు.

తనపై విమర్శలు చేసే వాళ్లకు.. సూటిగా సవాల్ చేశారు కొడాలి నాని. ఏ పార్టీ నేత అయినా సరే.. తనపై విమర్శలు చేస్తే.. గంటలోపే తగిన సమాధానం చెబుతానని తేల్చి చెప్పారు. కాసినోతో తనకు సంబంధం లేదు కాబట్టే.. తాను పెట్రోల్ పోసుకుని చనిపోతానని చెప్పిన విషయాన్ని నాని గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న టీడీపీ ఆఫీస్ లో పేకాట ఆడిన చరిత్ర చంద్రబాబుదని తీవ్రంగా ఆరోపించారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్ చెప్పు దెబ్బ కొట్టారంటూ.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే తనకు చెప్పారన్నారు. అలాంటి నేతలు తన గురించి ఆరోపణలు చేస్తే.. తగిన విధంగా సమాధానం చెప్పడానికి సిద్ధమని తేల్చి చెప్పారు.

గుండాటను చూసి కాసినో అని ఆరోపిస్తున్న టీడీపీ నేతల ఉచ్చులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పడవద్దని నాని అన్నారు. గతంలో తెలుగుదేశం కారణంగానే బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని కమలం పార్టీ నేతలే కామెంట్లు చేశారని గుర్తు చేశారు. అలాంటి టీడీపీ నేతల ఉచ్చు నుంచి బయటపడితేనే రాజకీయంగా సోము వీర్రాజుకు కానీ.. ఏపీలో బీజేపీకి కానీ ఏమైనా లాభం ఉంటుందని మంత్రి నాని అభిప్రాయపడ్డారు.

Read More:

GudiwadaCasino: గుడివాడకు వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం.. మధ్యలోనే సోము వీర్రాజు అరెస్ట్

Buddha Venkanna : గుడివాడ వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్తానా? బుద్ధా వెంకన్న