Minister Sidiri Appalaraju Comments : పవన్ కళ్యాణ్ పై మంత్రి సిదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు

నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. నిన్న పపన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ అటాక్ చేశారు. 

Minister Sidiri Appalaraju Comments : పవన్ కళ్యాణ్ పై మంత్రి సిదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు

APPALARAJU

Minister Sidiri Appalaraju Comments : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్ అయింది. పవన్ పై మంత్రులు మండిపడుతున్నారు. పవన్ ఎప్పుడు సభలు పెట్టిన సీఎం జగన్ తోపాటు మంత్రులను తిట్టడమే పని అని ఫైర్ అయ్యారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు.

నిన్న పపన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ అటాక్ చేశారు.  టీడీపీ డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారని విమర్శించారు. లోకేశ్ యువగళం అని పేరు పెట్టారు.. పవన్ కు యువశక్తి అని పేరు పెట్టారని పేర్కొన్నారు. మత్స్యకారుల వలసల గురించి పవన్ కు ఏం తెలుసని నిలదీశారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మస్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 9 హార్బర్లు నిర్మించిన ఘనత జగన్ ది అని స్పష్టం చేశారు.

Pawan Letter CM Jagan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

రాజకీయ అంటే ఊడిగం చేయడమేనా అని నిలదీశారు. మత్స్యకారుల జీవితాల్లో జగన్ దేవుడిగా నిలిచిపోతారని కొనియాడారు. చంద్రబాబు ప్యాకేజీ గురించి పవన్ ఏది బడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోరాటం చేతకాక వీరమరణం అవసరమా అని పవన్ మాట్లాడుతున్నాని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారని డైరెక్టుగా చెప్పు అని సూచించారు.

శ్రీకాకుళం రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. డైరెక్ట్ గా వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. పవర్ పంచ్ లతో జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. జాగ్రత్త అంటూ.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వారాహితో వస్తున్నా.. ఆపేదెవరో చూస్తా అంటూ సమర శంఖం పూరించారు.

Pawan Kalyan : రణస్థలంలో పవన్‌ యుద్ధభేరి.. వైసీపీ సర్కార్‌పై ‘పవర్’ పంచ్‌లు, టీడీపీతో పొత్తుపై క్లారిటీ

దశాబ్దం పాటు పోరాడానని తనకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తానని చెప్పారు. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా? ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదన్నారు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదని చెప్పారు. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తామని వెల్లడించారు.

కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తామని కల్యాణ్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వబోమన్నారు. సింగిల్ గానే పోటీ చేస్తే తనకు అండగా ఉంటానని హామీగా ఉంటే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.